Movie Ticket Price Hike
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించిన సందర్భాల్లో.. ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలనే నిబంధన అమల్లో ఉంది. ఈ నిధులను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్డీసీ) పర్యవేక్షణలో ప్రత్యేక ఖాతాకు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
* కార్మికుల సంక్షేమానికి నిధులు
సినిమా టికెట్ ధరల పెంపుతో ప్రేక్షకులపై అదనపు భారం పడుతున్న నేపథ్యంలో, ఆ అదనపు ఆదాయంలో కొంత భాగాన్ని చిత్ర పరిశ్రమలోని కార్మికుల సంక్షేమానికి వినియోగించనుంది. భారీ సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చే ప్రతిసారీ ఈ నిధుల జమ, వినియోగంపై స్పష్టత ఉండాలని సినీ వర్గాలు కూడా కోరుతున్నాయి.
* ఎగ్జిబిటర్ల నుంచి వసూలు
అఖండ 2, ది రాజాసాబ్, మన శివశంకర వరప్రసాద్, పెద్ది టికెట్ల ధరల పెంపుతో వచ్చిన లాభాల్లో 20 శాతం ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలని నిర్మాతలను టీఎఫ్ డీసీ కోరింది. నిబంధనల ప్రకారం వెంటనే కార్యాచరణను ప్రారంభించాలని సూచించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
