* ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స
ఆకేరు న్యూస్, డెస్క్: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తన నటనతో సుదీర్ఘకాలం అలరించిన సీనియర్ నటి ‘షావుకారు’ జానకి (95) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను వారం రోజుల క్రితం చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
* ఐసీయూకి తరలింపు – వెంటిలేటర్‌పై చికిత్స..
వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నప్పటికీ, నిన్న రాత్రికి ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటనే తీవ్ర సంరక్షణ విభాగానికి (ICU) తరలించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై ఐసీయూలో నిపుణులైన వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. 95 సంవత్సరాల వయసు కావడంతో ఆమె అవయవాలు చికిత్సకు సహకరించడం సవాలుగా మారిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉనట్లు ఆస్పత్రి వర్గాల సమాచారం.
* షావుకారు’గా సినీ ప్రస్థానం..
1950లో ప్రముఖ దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ తెరకెక్కించిన ‘షావుకారు’ సినిమా ద్వారా చలనచిత్ర రంగానికి పరిచయమైన జానకి, ఆ మొదటి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శివాజీ గణేషన్, రాజ్ కుమార్ వంటి మహామహుల సరసన కథానాయకిగా, ఆ తర్వాత పలు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో ఆమె అద్భుతమైన నటనను కనబరిచారు.
షావుకారు జానకి అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియగానే సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
