Visakhapatnam School Boy Death
* సీసీటీవీ విజువల్స్ వైరల్, పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, డెస్క్:విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో గుండెలను పిండేసే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో టీచర్ మందలించడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఓ చిన్నారి క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
బాధితుల వివరాల ప్రకారం.. ఎల్కేజీ చదువుతున్న ప్రణయ్ తేజ్ (6) అనే బాలుడు హోమ్‌వర్క్ చేయలేదని పాఠశాల టీచర్ అతడిని తీవ్రంగా మందలించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రణయ్, గుక్కపెట్టి ఏడుస్తూ భయంతో ఊపిరి తీసుకోలేక ఉపాధ్యాయురాలిపైనే కుప్పకూలిపోయాడు.
వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం చిన్నారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్ (KGH) ఆస్పత్రికి తరలించారు. అయితే, బాలుడిని పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలు బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహంతో పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
