Telangana GO 77 Ticket Prices
* తెలంగాణ ప్రభుత్వానికి ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరల నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 77 (G.O.Ms.No.77)పై సినీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నూతన టికెట్ ధరల విధానాన్ని వెంటనే పునఃసమీక్షించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) ప్రభుత్వాన్ని కోరింది.
సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్ ధరలను ఖరారు చేసే ముందు సినీ పరిశ్రమకు చెందిన కీలక భాగస్వాములతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాలని ఛాంబర్ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వర్గీకరణ విధానం పరిశ్రమ శ్రేయస్సుకు అనుకూలంగా లేదని అభిప్రాయపడింది.
* వర్గీకరణపై సినీ వర్గాల్లో ఆందోళన..
ముఖ్యంగా థియేటర్లను ‘స్పెషల్ థియేటర్లు’ గా కొత్తగా వర్గీకరించడం పట్ల టాలీవుడ్ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని ఛాంబర్ పేర్కొంది. ఈ నూతన విధానం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కష్టసాధ్యమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు, నిర్వాహక వ్యయాలను దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించిన అనంతరమే టికెట్ ధరలపై తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
