Class Toppers Cash Rewards
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ ఎ-1 పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులు శివకేశ్వర్, సంతోష్, శాన్వి, అభిరామ్, అశ్విత (6 వ తరగతి నుండి 10వ తరగతి) వెయ్యి రూపాయల చొప్పున రూ. 5 వేల పారితోషికాన్ని అందించారు. వరంగల్ కి చెందిన దుర్గా సిరామిక్స్ అధినేత వడ్లమూడి యాక నారాయణ ఈ పారితోషికాన్ని అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెనుమాటి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ పారితోషకాన్ని గ్రామ సర్పంచ్ మారపాక సుజన, పాఠశాల చైర్మన్ బేతి మంజుల ఉపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
