BRS leaders condole Poolamma family
* మృతురాలు గిరిక పూలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
ఆకేరు న్యూస్, రాయపర్తి:
రాయపర్తి మండలంలోని కిష్టాపూరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు గిరిక పూలమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం విచారకరం.
విషయం తెలుసుకున్న రాయపర్తి మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో మృతురాలి నివాసానికి వెళ్లిన నాయకులు, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్,గ్రామ మాజీ సర్పంచ్ గట్టు నరసింహాచార్యులు, మరియు గ్రామ వార్డు సభ్యులు కేమిడీ యాదయ్య, గిద్దె వెంకటయ్య, తాళ్ల పెళ్లి శోభన్ బాబు, మాజీ సర్పంచ్మాజీ సర్పంచ్ కుమారుడు సంకినేని నవీన్, అందరూ కలిసి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. “పార్టీ కోసం ఎంతో కృషి చేసిన పూలమ్మ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం” అని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.
* ఏ గ్రామంలో కష్టం వచ్చినా తక్షణమే స్పందన
రాయపర్తి మండలంలో ఏ గ్రామంలోనైనా బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు అనారోగ్యం చేసినా, లేదా అనుకోని ప్రమాదాలు (యాక్సిడెంట్లు) జరిగినా మండల బీఆర్ఎస్ నాయకత్వం వెంటనే స్పందిస్తోంది. బాధితుల ఇళ్లకు నేరుగా వెళ్లి పరామర్శిస్తూ, వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం కొండంత భరోసానిస్తోంది.
ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి ఆదరణతోనే ముందుకు..
మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, అండదండలు, నిరంతర ఆదరణ మరియు మార్గదర్శకత్వంతోనే మండలంలో ఈ విధమైన సంక్షేమ, పరామర్శ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగుతున్నాయని నాయకులు తెలిపారు. కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యుల్లా భావించే ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సూచనల మేరకు ప్రతి గ్రామంలోని కార్యకర్తకు కష్టం వస్తే మేమున్నామంటూ పార్టీ యంత్రాంగం ముందుంటోందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కిష్టాపూరం గ్రామ వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు మరియు BRS పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
