Madhavaram Krishna Rao Slams Congress
* కేసీఆర్ కుటుంబంపై విమర్శలు తప్ప చేసిందేంటి?
* నగర భూములను 22ఏలో చేర్చడంపై ప్రధానికి లేఖ రాస్తాం
– కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
కాసులు, కమీషన్ల కోసం కాంగ్రెస్ మంత్రులు కుట్రలకు పాల్పడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు తప్ప వాళ్లు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. పేదలు నివాసం ఉండే భూములను నిషేధిత జాబితా(22ఏ)లో ఉంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపస్‌లో నిర్వహించిన సమావేశంలో సర్కారు తీరును తప్పుబట్టారు.
* ప్రధానికి లేఖ రాస్తాం
కూకట్పల్లి సర్కిల్ పరిధిలో ఉన్న భూములను 22ఏలో చేర్చడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తామని మాధవరం కృష్ణారావు తెలిపారు. కూకట్పల్లి శేషాద్రినగర్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలకులు గత మూడేళ్లుగా కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం తప్ప వారు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పైసపైసా కూడబెట్టి నగరంలో ఇళ్లు కొనుక్కున్న వాళ్ల స్థలాలు నిషేధిత భూముల జాబితాలో చేర్చడం ఏంటని ప్రభుత్వాని ప్రశ్నించారు.
* పొంగులేటి నాడొకలా.. నేడొకలా..
ఎనిమిది నెలల క్రితం కూకట్‌పల్లికి వచ్చిన మంత్రి పొంగులేటీ శ్రీనివాస్‌రెడ్డికి 22ఏలో భూములు చేర్చడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆనాడు అన్నారని, ఇప్పుడు ఏమీ తెలియనట్లు క్షమాపణ చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ముడుపులు ఇచ్చిన వారికి ఉపశమనం కల్పిస్తున్నారని, దీని వెనుక పెద్దల హస్తాలు ఉన్నాయని విమర్శించారు.
* సీఐఐ విచారణ జరపాలని
22ఏ పేరుతో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ సంస్థతో విచారణ చేపించాలని మాధవరం డిమాండ్ చేశారు. తప్పయితే అధికారులపై నెట్టడం ఒప్పయితే మేమే చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం కాంగ్రెస్ పాలకులకే చెందిదని ఎద్దేవా చేశారు. వసంత్‌నగర్, సీబీసీఐడీకాలనీ, ఆల్విన్‌కాలనీ, తులసివనం ప్రాంతాలలో 50 ఏళ్ల క్రితమే ప్రజలు నివాసం ఉంటున్నారని అన్ని అనుమతులు తీసుకున్నారని వాటిని ఏ ప్రాతిపదికన చేర్చారో అధికారులు వివరణ ఇవ్వాలని. దీనిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే నిరహారదీక్ష చేయడానికైన సిద్ధమన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
