కారు ఢిక్కీలో మహిళ మృతదేహం
* ఎల్కతుర్తిలో కలకలం
ఆకేరు న్యూస్ , హనుమకొండ:
ఎల్కతుర్తి మండల కేంద్రంలో గుర్తుతెలియని యువతి మృహదేహం మండల కేంద్రంలో కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో రెండు రోజులుగా కారు రోడ్డు పక్కన పార్కు చేసిన కారులోంచి దుర్గంధం రావటంతో అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్సై నరసింహారావులు కారు ఓనర్ సురేందర్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. అదే గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తికి కారు అద్దెకు ఇచ్చినట్లు తెలిపాడు. అతని ద్వారా కారు డిక్కిని తెరువగా అందులో మహిళ మృతదేహం దుప్పటిలో చుట్టి ఉంది. .కారులో ఉన్న గుర్తు తెలియని యువతి మృతదేహం ఎవరిది,ఎవరు తీసుకొచ్చారు ఎవ్వరికీ తెలియకపోవడంతో క్లూస్ టీమ్ ను రంగం లోకి దింపిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతి చెందిన మహిళ గోదావరిఖనికి చెందిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కారు డిక్కీలో మృతదేహం సంఘటనతో మండల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
