Sowcar Janaki Passes away at the age of 94
* అలనాటి నటి ‘షావుకారు’ జానకి కన్నుమూత
ఆకేరు న్యూస్, డెస్క్: దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అలనాటి ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత ‘షావుకారు’ జానకి (94) ఇకలేరు. గత కొంతకాలంగా శ్వాసకోశ మరియు వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మధ్యాహ్నం 1:59 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు నడిగర్ సంఘం అధ్యక్షుడు, నటుడు నాజర్ అధికారికంగా వెల్లడించారు.
* ‘షావుకారు’తో మొదలైన సంచలనం..
1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించిన జానకి, చిన్నతనంలోనే రేడియో ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. 1950లో ఎన్టీఆర్ సరసన నటించిన ‘షావుకారు’ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, ఆమె ఇంటి పేరుగా మారిపోయింది.
* 400లకు పైగా చిత్రాల్లో అద్భుత అభినయం..
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏడు దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆమె 400కు పైగా సినిమాల్లో నటించారు. కథానాయికగానే కాకుండా విలక్షణమైన సహాయ పాత్రల్లో, తల్లి, అమ్మమ్మ పాత్రల్లో నటించి మెప్పించారు. సినీరంగానికి ఆమె చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2022లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది.
షావుకారు జానకి మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపం తెలియజేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
