Why Did Deepika Padukone Exit Spirit?
* దీపికా పదుకొణే అడిగింది… బడ్జెట్ కు సరిపోవాలి కదా
* సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం ఇప్పటికే పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. దీపిక రెమ్యునరేషన్, పని గంటలతో పాటు సినిమా లాభాల్లో వాటా కూడా అడిగారని ఆయన ఆరోపించారు.
* 10 శాతం వాటా
ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. దీపికా పదుకొణె సినిమా లాభాల్లో 10 శాతం వాటా కోరారని చెప్పారు. ఆమె ఏదైనా డిమాండ్ చేయవచ్చని, అయితే సినిమా బడ్జెట్‌కు ఆ డిమాండ్ సరిపోవాలని అన్నారు. ఆర్థికంగా లెక్కలు సరిపోకపోవడంతో ఇతర ఆప్షన్ల కోసం వెతికామని తెలిపారు.
* 18 నెలల పాటు చర్చించాం
దీపికతో సందీప్ సుమారు 18 నెలల పాటు మాట్లాడారని ప్రణయ్ తెలిపారు. సినిమా కథ, పాత్రకు సంబంధించిన వివరాలను ఆమెతో చర్చించామని చెప్పారు. అయితే తమ మధ్య అంతర్గతంగా జరిగిన చర్చలు బయటకు వెళ్లడంతో తాము అసంతృప్తికి గురయ్యామని ప్రణయ్ ఆరోపించారు.బ దీపికను మార్చడానికి ప్రధాన కారణాల్లో రెమ్యునరేషన్, పని వేళలు ఉన్నాయని ప్రణయ్ చెప్పారు. ఇది కేవలం అదనంగా రూ.5-6 కోట్లు అడిగిన వ్యవహారం కాదని స్పష్టం చేశారు.
* ఇదేనా మీ ఫెమనిజం?
ఈ వివాదం సమయంలో సందీప్ రెడ్డి వంగా కూడా ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. పేరు చెప్పకుండా ఓ నటిని ఉద్దేశిస్తూ.. కథను నమ్మకంతో చెప్పిన తర్వాత ఆ వివరాలు బయటకు చెప్పడం సరికాదని అన్నారు.తన కథను బయటకు చెప్పడం, యువ నటిని కించపరచడం వంటి చర్యలను ఆయన ప్రశ్నించారు. “ఇదేనా మీ ఫెమినిజం?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
* అన్యాయమైన డిమాండ్ కాదు – దీపికా
స్పిరిట్ నుంచి తప్పుకోవడానికి ముందు దీపిక 8 గంటలు మాత్రమే పనిచేస్తానని కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై గతంలో ఆమె స్పందిస్తూ.. తాను అడిగింది అన్యాయమైన డిమాండ్ కాదని చెప్పారు. మహిళా నటిగా మాత్రమే కాకుండా, చాలా మంది పురుష నటులు కూడా ఏళ్లుగా 8 గంటల షిఫ్ట్‌లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దీపిక స్థానంలో త్రిప్తి డిమ్రీని హీరోయిన్గా తీసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ 2027 మార్చిలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
