Actor Varun Tej Marriage Life
* విజయాలు, వైఫల్యాలను పంచుకోవడానికి తోడు అవసరం
* ఓ ఇంటర్వ్యూలో మెగా హీరో వరుణ్ తేజ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పెళ్లి, తండ్రి కావడం తన జీవితానికి కొత్త దిశను చూపించాయని హీరో వరుణ్ తేజ్ అన్నారు. నటి లావణ్య త్రిపాఠిని 2023లో వివాహం చేసుకున్న ఆయన.. గతేడాది సెప్టెంబర్లో కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెల జన్మించిన విషయం తెలిసిందే.
* ఒక తోడు అవసరం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ తన వైవాహిక జీవితం, తండ్రిగా మారిన తర్వాత వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “పెళ్లి సరైన సమయంలోనే జరిగింది. అయితే మా తల్లిదండ్రులు మాత్రం ఆలస్యంగా చేసుకున్నానని ఇప్పటికీ అంటుంటారు” అని చెప్పారు. జీవితంలో కష్టపడిన తర్వాత తన విజయాలు, వైఫల్యాలను పంచుకోవడానికి ఒక తోడు అవసరమని వరుణ్ తెలిపారు. తనకు ఎప్పుడూ ఒక జీవిత భాగస్వామి ఉండాలని కోరుకున్నానని చెప్పారు.
* కొడుకు పుట్టాక.. మారింది
తండ్రిగా మారిన తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని వరుణ్ తేజ్ అన్నారు. ఏది ముఖ్యమో, ఏది కాదో తెలుసుకున్నానని, తన ప్రాధాన్యతలు కూడా మారిపోయాయని చెప్పారు.“నా కొడుకంటే నాకు ఎంతో ప్రేమ. ప్రతిరోజూ అతన్ని చూడాలని అనిపిస్తుంది. అతనికి మంచి తండ్రిగా ఉండటమే నా లక్ష్యం. సినిమాల్లో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా.. నా కొడుకు తన తండ్రిని గౌరవించే వ్యక్తిగా చూడాలని కోరుకుంటున్నా” అని వరుణ్ పేర్కొన్నారు.
* పెళ్లి విషయంలో ఎవరికీ ఒత్తిడి చేయొద్దు
పెళ్లి చేసుకోవాలనుకునే వారికి సలహా ఇస్తూ.. ఎవరినీ పెళ్లి కోసం బలవంతం చేయకూడదని వరుణ్ అన్నారు. సరైన వ్యక్తి ఎదురైనప్పుడు మనసుకు తెలుస్తుందని చెప్పారు.పెళ్లి చేసుకోవాలనుకునే వారికి అది మంచి నిర్ణయమేనని, అయితే ఒంటరిగా సంతోషంగా ఉన్నవారు అలాగే ఉండటంలోనూ తప్పులేదని తెలిపారు. పెళ్లి అనేది సామాజిక ఒత్తిడి వల్ల చేసుకునేది కాదని, జీవితంలో ప్రశాంతంగా, సంతోషంగా ఉండటమే ముఖ్యమని వరుణ్ తేజ్ అభిప్రాయపడ్డారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
