SP Shabarish Ganja Awareness
* యువతకు ఎస్పీ శబరీష్ పిలుపు
అకేరు న్యూస్ మహబూబాబాద్ జిల్లా, గూడూరు: గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్ నాశనం అవుతుందని, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. గంజాయి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గూడూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శబరీష్ 2కే రన్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన అవగాహన ర్యాలీలో పోలీసులు, యువకులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.
యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తమ భవిష్యత్‌పై దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, ప్రజలు సమష్టిగా బాధ్యత తీసుకోవాలని సూచించారు.
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని ఎస్పీ శబరీష్ తెలిపారు.
గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ప్రజల దృష్టికి వస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
గూడూరులో నిర్వహించిన 2కే రన్, అవగాహన ర్యాలీ ద్వారా మత్తు పదార్థాలకు దూరం.. ఆరోగ్యకరమైన భవిష్యత్‌కు బాట అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. భారీగా పాల్గొన్న యువత, విద్యార్థులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గంజాయి నిర్మూలనతో పాటు యువతలో ఆరోగ్యకరమైన జీవన విధానం, క్రీడల పట్ల ఆసక్తిని పెంచేలా ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
