Bank Holidays August 2026
* వచ్చే వారం కీలక సెలవులు
అకేరు న్యూస్ హైదరాబాద్: బ్యాంకు ఖాతాదారులు వచ్చే వారం తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన ఆగస్టు 2026 సెలవుల క్యాలెండర్ ప్రకారం.. పలు రాష్ట్రాల్లో పండుగలు, ప్రాంతీయ సెలవుల కారణంగా బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి. సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండవు.
తెలంగాణలో ఆగస్టు 25న ఈద్-ఎ-మిలాద్, ఆగస్టు 26న ఈద్ మిలాదున్నబీ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. అలాగే ఆగస్టు 28న రక్షాబంధన్/వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెలంగాణలో బ్యాంకు సెలవు ప్రకటించబడింది.
ఇక ఆగస్టు 23 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసివుంటాయి. అయితే ఆగస్టు 30 కూడా ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. రాష్ట్రాలు, నగరాల వారీగా సెలవుల్లో తేడాలు ఉండే అవకాశం ఉన్నందున ఖాతాదారులు తమ స్థానిక బ్యాంకు సెలవుల జాబితాను ఒకసారి పరిశీలించడం మంచిది.
బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ATM వంటి డిజిటల్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. అత్యవసర లావాదేవీలు ఉన్నవారు ముందుగానే పూర్తి చేసుకోవడం లేదా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు.
ఖాతాదారులకు సూచన: చెక్కులు, నగదు డిపాజిట్/విత్డ్రా, బ్యాంకు శాఖలో చేయాల్సిన ఇతర పనులు ఉంటే సెలవు తేదీలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పూర్తి చేసుకోవాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
