RTC Contract Conductors Protest
* సమాచారం లేకుండా 90 మంది కాంట్రాక్ట్ ఆర్టీసీ కండక్టర్లు ఉద్యోగుల తొలగింపు..
* ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ఆందోళన
అకేరు న్యూస్ హనుమకొండ: వరంగల్ రీజియన్ ఆర్టీసీలో గత ఏడాది కాలంగా విధులు నిర్వహిస్తున్న సుమారు 90 మంది ఆర్టీసీ కండక్టర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రాత్రికి రాత్రే విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ ఉద్యోగులు శనివారం హనుమకొండలోని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
గత సంవత్సరం కాలంగా తమతో విధులు చేయించుకుని, ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి సంబంధించిన పలు కీలక కార్యక్రమాల్లో, ముఖ్యంగా మేడారం మహాజాతరను విజయవంతం చేయడంలో తమ పాత్ర ఎంతో కీలకంగా ఉందని వారు తెలిపారు.
తమ సేవలను వినియోగించుకున్న తర్వాత అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, తమ కుటుంబాలను రోడ్డున పడకుండా ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
