Gold Price Today
* 10 గ్రాములపై రూ.1,520 పెరుగుదల
అకేరు న్యూస్ డెస్క్ : బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా పైకి కదులుతున్నాయి. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,520 పెరిగి రూ.1,63,090కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.1,400 పెరిగి రూ.1,49,500కు చేరుకుంది.
బంగారం ధరల పెరుగుదలతో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ధరలు మరింత పెరుగుతుండటంతో పసిడి కొనుగోలుదారులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు.
ఇక వెండి ధర కూడా భారీ స్థాయిలో కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.70 లక్షలుగా ఉంది. బంగారం, వెండి ధరలు ఒకేసారి పెరుగుతుండటంతో మార్కెట్లో ధరలపై ఆసక్తి నెలకొంది.
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, పెట్టుబడిదారుల డిమాండ్ వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతుండటంతో రానున్న రోజుల్లో ధరల కదలిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
