Madhuri Rathod Complaint
అకేరు న్యూస్ వేములవాడ: ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్‌పై దాడి ఘటన వివాదాస్పదంగా మారింది. తనను అనవసరంగా కొట్టారని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె వేములవాడ పోలీసులను ఆశ్రయించారు.
ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను బూతులు తిడుతూ అకారణంగా తనపై చేయి చేసుకున్నారని మాధురి రాథోడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడికి పాల్పడిన శరణ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
అంతేకాకుండా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పలువురు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాధురి రాథోడ్ ఆరోపించారు. తనను లక్ష్యంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన వీడియోలను చిత్రీకరించడమే కాకుండా, తన ఐఫోన్‌ను కూడా దొంగిలించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి ఘటన, సోషల్ మీడియా ప్రచారం, ఫోన్ చోరీ అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని కోరారు.
మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
