HCL TechBee Job Drive
* హన్మకొండలో ఆగస్టు 25న హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్‌కు అర్హత పరీక్ష
అకేర్ న్యూస్ హన్మకొండ: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గోపాల్ తెలిపారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 25వ తేదీ మంగళవారం ఉదయం 11:30 గంటలకు హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఐసీఎస్సెస్ కంప్యూటర్ కేంద్రంలో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు.
2025-26 విద్యా సంవత్సరంలో MPC, జనరల్, ఒకేషనల్ విభాగాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఎంపికకు అర్హులని అధికారులు తెలిపారు. ఇంటర్లో కనీసం 75 శాతం మార్కులు సాధించిన వారు పరీక్షకు హాజరుకావచ్చు.
టెక్ బీ ప్రోగ్రామ్ లో ఎంపికైన విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగంతో పాటు డిగ్రీ విద్యను కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.2.20 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు వేతనం లభించనుంది.
* అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాల్సినవి
10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్
ఆధార్ కార్డు
పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్
మరిన్ని వివరాల కోసం జిల్లా ఇన్చార్జ్ నరేష్‌ను 7569177071, 7981834205 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఇంటర్ పూర్తిచేసిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
