Trainee IPS Uday Krishna Potency Test
Published:
* ట్రైనీ IPS ఉదయ్‌కృష్ణ హైకోర్టును ఆశ్రయించిన వైనం
అకేరు న్యూస్ హైదరాబాద్ :ట్రైనీ IPS అధికారి ఉదయ్‌కృష్ణ పొటెన్సీ టెస్ట్ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించారు. రాజేంద్రనగర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై పొటెన్సీ టెస్ట్ నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఉదయ్‌కృష్ణ పొటెన్సీ టెస్ట్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు విచారణలో ఎలాంటి ఆదేశాలు వెలువడతాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
