Warangal STP Management
* ఎస్టీపీల నిర్వహణపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి డాక్టర్ టికే శ్రీదేవి సమీక్ష
* కమిషనర్ టి. వెంకన్నతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
అకేరు న్యూస్ హన్మకొండ : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి శుక్రవారం హైదరాబాద్ నుంచి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్నతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, గ్రేటర్ వరంగల్ పరిధిలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (STPs) నిర్వహణ, పురోగతిపై సమీక్షించారు.
ఎస్టీపీలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ, శుద్ధి ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప్లాంట్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికుమార్, మహేందర్, డీఈ లు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
