Minister Seethakka Carries Bier
* పాడె మోసిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:
మండలంలోని ఓటాయి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత గ్రామ సర్పంచ్ గట్టి రాములు ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో ఓటాయి గ్రామంలో శోకసంద్రం అలుముకుంది.శనివారం నిర్వహించిన గట్టి రాములు అంతిమయాత్రలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం స్వయంగా ఆయన పాడెను మోసి, అంతిమ ప్రయాణంలో తోడుగా నిలిచారు.
గ్రామానికి మరియు పార్టీకి గట్టి రాములు చేసిన సేవలను మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ అలాగే ప్రభుత్వం తరఫున అన్ని వేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ అంతిమయాత్రలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాములుకు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
