Regonda Bomb Blast
* మహిళకు తీవ్ర గాయాలు
* రేగొండ మండలంలో కలకలం
ఆకేరు న్యూస్, భూపాలపల్లి: పంట చేనులో బాంబు పేలింది. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గూడెపల్లి గ్రామంలో మోరె రాజు భూమిలో ఇద్దరు మహిళా కూలీలు పని చేస్తున్నారు. ఈక్రమంలో గుండె స్వర్ణలత (34) అనే మహిళా కూలీకి భూమిలో గట్టిగా ఏదో తగిలింది. దానిని కొడవలితో కదిలించడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలింది. ఈ ప్రమాదంలో స్వర్ణలతకు ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను హుటాహుటిన పరకాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.
* చేనులో బాంబు ఎక్కడిదీ..?
చేనులో బాంబు ఎక్కడిది..? ఎవరు పెట్టి ఉంటారు..? గతంలో ఎవరైనా పెట్టి మరచి పోయారా..? లేదా సరికొత్తగా ఏర్పాటు చేసిందా అన్న కోణంలో రేగొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో నక్సలైట్ల సంచారం ఉండేది.కాబట్టి అప్పట్లో వారు మర్చిపోయిన బాంబు ఇదేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
———————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
