Prema Baanisa Movie Poster
* ఆవిష్కరించిన హీరోయిన్ లయ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
హనీ క్రియేషన్స్ సమర్పణలో హీరోలు శ్రీ, రాజువర, హీరోయిన్ శృతి శంకర్, నటులు అప్పారావు, రైజింగ్ రాజు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రేమబానిస’ ఈ చిత్రానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ లో హీరోయిన్ లయ చేతుల మీదుగా పూజా కార్యక్రమం, పోస్టర్ లాంచ్ ఘనంగా జరిగింది.
ఈ సందర్బంగా దర్శకుడు సలీం భాషా మాట్లాడుతూ… హీరోయిన్ లయ చేతుల మీదుగా ‘ప్రేమబానిస’ పోస్టర్ విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. మా చిత్ర కార్యక్రమానికి చీప్ గెస్ట్ గా వచ్చిన లయకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రేమబానిస’ అందర్నీ అలరించే కథాంశంతో రూపుదిద్దుకుంటోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందనన్న నమ్మకం ఉందన్నారు. సెప్టెంబర్ నుండి కర్నూల్ లో ఈ చిత్రం శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది అని తెలిపారు.
నిర్మాతలు ఎస్. మహబూబ్ భాషా, కె. ప్రభాకర్ లు మాట్లాడుతూ.. ప్రస్తుతం టాలీవుడ్ లో వస్తోన్న ప్రేమకథలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించనున్నాం అని తెలిపారు. హీరోలు శ్రీ, రాజువర మాట్లాడుతూ.. యువతరం మెచ్చే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. మాకు ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం అన్నారు. హీరోయిన్ శృతి శంకర్ మాట్లాడుతూ.. చక్కటి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన కథానాయిక పాత్రకు పూర్తి న్యాయం చేస్తానని పేర్కొన్నారు.
—————————–

Please tell us what is wrong. Your report will be sent to the website team.
