బీఆర్ ఎస్ నేత ఏనుగు రాకేష్ రెడ్డి అద్వర్యంలో 2కే రన్
* సమస్యల పరిష్కారం కోసం పరుగు
* యుద్ధ ఖైదీల్లా మారి పోయారు
– బీఆర్ ఎస్ నేత ఏనుగు రాకేష్ రెడ్డి
ఆకేరు న్యూస్ , హనుమకొండ : రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నేతలు మండి పడ్డారు. ఆదివారం ఉదయం తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం అద్యర్యంలో 2 కే రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీఆర్ ఎస్ రాష్ట్ర నేత ఏనుగు రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండలోని ఏకశిలా పార్క్ నుంచి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వరకు 2కే రన్ కొనసాగింది. పెద్ద సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు, పార్టీ నాయకులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా కొత్త పెన్షన్ విధానం, పార్ట్ పెన్షన్ విధానం అమలు, పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు . జీవో 317లో ఉద్యోగులకు న్యాయం జరిగేలా సవరణలు చేయాలి. సకాలంలో ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
* యుద్ధ ఖైదీల్లా మారిపోయారు.
ఏనుగు రాకేష్ రెడ్డి
2 కే రన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. ముఖ్యంగా ఉద్యోగులను కూడా ఇదే పద్దతిలో మోసం చేస్తోందన్నారు. ఇక రిటైర్డ్ ఉద్యోగుల సంగతి చెప్పనక్కర లేదు. వాళ్ళకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలను కూడా కల్పించడం లేదన్నారు. కొడుకులు, కోడళ్ళు ఇతర కుటుంబ సభ్యుల మీద ఆదార పడి బతకాల్సిన పరిస్థితి వారికి ఏర్పడిందన్నారు. ఒక్కా మాటలో చెప్పాలంటే రిటైర్డ్ ఉద్యోగులు యుద్ధ ఖైదీల్లా మారిపోయారన్నారు.
———————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
