ఏడిపిస్తివే చిట్టి ప్రేమను చంపి’ అనే పాట ను రిలీజ్ చేసిన మాజీ మంత్రి ఎర్రెబెల్లి దయాకర్ రావు
* ఏడిపిస్తివే చిట్టి ప్రేమను చంపి’ పాట ఆవిష్కరణ
ఆకేరు న్యూస్,హైదరాబాద్: డైరెక్టర్ నవనీత్ కుమార్ దర్శకత్వంలో పవన్ కథానాయకుడిగా, సాయికుమార్ బలభద్ర రచనలో తెరకెక్కిన ‘ఏడిపిస్తివే చిట్టి ప్రేమను చంపి’ అనే పాట ఆదివారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, పాటను అధికారికంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. పాట బాణీలు, సాహిత్యం ఆకట్టుకునేలా ఉన్నాయని ప్రశంసించారు. యంగ్ టీమ్ అంతా కలిసి చేసిన ఈ ప్రయత్నం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్ర బృందానికి తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. యూత్‌ను ఆకట్టుకునే రీతిలో ఈ పాటను రూపొందించారని, ఈ పాట ప్రేక్షకుల ఆదరణ పొంది చిత్ర యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు నవనీత్ కుమార్, హీరో పవన్, రచయిత సాయికుమార్ బలభద్ర, పలువురు ప్రముఖులు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
——————–

Please tell us what is wrong. Your report will be sent to the website team.
