Bhupalapally Chain Snatching
* మిస్సయిన గోల్డ్ చైన్.. తప్పిన పెద్ద ముప్పు
ఆకేరు న్యూస్, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్లు మళ్లీ పడగ విప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు లక్ష్మీనగర్ కాలనీలో తెల్లవారుజామున చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్ యత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
* ఘటన వివరాలు…
లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన సాంబరెడ్డి, అహల్య దంపతులు ఉదయాన్నే మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు. వారు తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు వారిని వెంబడించారు. పథకం ప్రకారం.. బైక్ నడుపుతున్న వ్యక్తి వీధి చివర సిద్ధంగా ఉండగా, మరొక దుండగుడు అహల్య మెడలోని బంగారు గొలుసును ఒక్కసారిగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు.
అయితే, మహిళ అప్రమత్తం కావడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. గొలుసు దుండగుడి చేతికి చిక్కకుండా మహిళ మెడలోనే పడిపోయింది. ప్లాన్ బెడసికొట్టడంతో దొంగలు వెంటనే వీధి చివర బైక్‌పై వేచి ఉన్న మరో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. దుండగుల దాడి నుంచి అహల్య తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.
* CCTVలో రికార్డైన దృశ్యాలు…
ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
* పెట్రోలింగ్ పెంచాలని విజ్ఞప్తి….
లక్ష్మీనగర్‌లో గత ఏడాది రాఖీ పౌర్ణమి సమయంలోనూ ఒక ఇంట్లో భారీ చోరీ జరిగి నగదు, బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఇప్పుడు మళ్లీ వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో కాలనీవాసులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
లక్ష్మీనగర్ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో బ్లూకోల్ట్స్ సిబ్బందితో పాటు పోలీస్ పెట్రోలింగ్‌ను తీవ్రం చేయాలని, కాలనీ ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
