Sumanth OSD Case
* నలుగురు లభ్యం, పరారీలో మరికొందరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్ కేసులో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. ఈ కేసులో విచారణ జరుపుతున్న ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరో ముగ్గురు నిందితులను గుంటూరు జిల్లా మార్టూరులో అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిని అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తీక్ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. మార్టూరులో దాడులు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది, తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ వ్యవహారంతో సంబంధం ఉండి పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను వేగవంతం చేశాయి. త్వరలోనే మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
