Hyderabad Student Dies in USA
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు విద్యార్థి అక్కడ కన్నుమూశాడు. హైదరాబాద్కు చెందిన సాయి ప్రదీప్ (దీపు) అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి, ఉద్యోగ అన్వేషణలో ఉండగా ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
* వివరాల్లోకి వెళ్తే..
సాయి ప్రదీప్ 2024 చివరిలో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. శాన్ ఆంటోనియోలో ఉంటూ ఇటీవల తన మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే, ఆశించిన స్థాయిలో ఉద్యోగం లభించకపోవడంతో కొంతకాలంగా మానసిక ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
మృతికి గల ఖచ్చితమైన కారణాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. సాయి ప్రదీప్ మరణ వార్త విన్న అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. హైదరాబాద్లోని వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
