Sangareddy Nurse Suicide
ఆకేరు న్యూస్, : ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించారని కన్న తల్లిదండ్రులకే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి దారుణంగా హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితురాలైన నర్సు సురేఖ (25) ఆత్మహత్యకు పాల్పడింది.
* ఘటన పూర్వాపరాల వివరాల్లోకి వెళ్తే…
సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సురేఖ, తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు దశరథ్, లక్ష్మి నిరాకరించారనే కోపంతో ఏడు నెలల క్రితం ఘాతుకానికి ఒడిగట్టింది. నర్సింగ్ వృత్తిలో ఉన్న అనుభవంతో వారికి హెల్త్ చెకప్ పేరిట అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం తల్లిదండ్రులు సహజంగానే మృతి చెందినట్లు డ్రామా ఆడింది. అయితే, పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా విచారించగా అసలు నిజాలు బయటపడి సురేఖ జైలుపాలైంది.
* బెయిల్పై బయటకొచ్చి…
ఇటీవల న్యాయస్థానం నుంచి బెయిల్పై బయటకు వచ్చిన సురేఖ, కొద్ది రోజులుగా సంగారెడ్డిలోని ఒక హాస్టల్లో నివాసముంటోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, ఏ విధంగానైతే తన తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాలు తీసిందో, అదే తరహాలోనే తాను కూడా మత్తు ఇంజెక్షన్ తీసుకుని హాస్టల్ గదిలోనే సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
