Konda Surekha Disciplinary Committee
* స్పందించిన క్రమశిక్షణా కమిటీ..
* మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతరం ఉత్పన్నమైన రాజకీయ పరిణామాలపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ మొత్తం ఎపిసోడ్‌పై రూపొందించిన నివేదికను కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీకి క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి సమర్పించనున్నారు.
* లండన్ నుంచి రాగానే సీఎంతో భట్టి, మల్లు రవి భేటీ..
విదేశీ పర్యటన ముగించుకుని లండన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ మల్లు రవి అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాలు, ముఖ్యంగా కొండా సురేఖ వివాదంపైనే ఈ సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సమాచారం. సీఎం పర్యటన ముగిసిన వెంటనే ఈ భేటీ జరగడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది.
* వీడియోల పరిశీలన.. కమిటీ భేటీ…
గాంధీభవన్‌లో సమావేశమైన క్రమశిక్షణా కమిటీ సభ్యులు.. సుస్మిత మాట్లాడిన వీడియో క్లిప్పింగులను పరిశీలించారు. అలాగే మంత్రి కొండా సురేఖ ఇచ్చిన లిఖితపూర్వక వివరణను కూడా సేకరించారు. ఈ వ్యవహారంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండటంతో, ఇవాళ మరోసారి కమిటీ భేటీ కానుంది. వీడియో ఆధారాలు, ఎమ్మెల్యేల ఫిర్యాదుల ఆధారంగా తగిన చర్యలకు కమిటీ సిఫార్సు చేసే అవకాశముంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
