* కొత్త వ్యవస్థపై సచివాలయంలో సమీక్ష
* హైడ్రా విధివిధానాలపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్)పై తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యత హైడ్రా (Hydra) కు బదలాయించాలని ఆదేశించారు. జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ (Police Station) పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ (Assembly Constituency) పరిధులు పూర్తిగా ఒకే జోన్లో వచ్చేలా జాగ్రత్త వహించాలన్నారు. బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’ ఉండాలని అధికారులకు సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) వరకు 2 వేల చదరపు కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలని సీఎం (CM) ఆదేశించారు. హెచ్ఎండీఏ(HMDA), వాటర్ వర్క్స్ (Water Works), డిజాస్టర్ మేనేజ్మెంట్ (Disaster Management), మున్సిపల్ విభాగాల (Municipal Divisions) మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల (Assembly election) లోపు హైడ్రా విధివిధానాలు ఖరారు చేయాలని, అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నాలాల కబ్జాలపై కఠినంగా ఉంటామని రేవంత్ (CM Revanth)తెలిపారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Shanti Kumari), ఇతర అధికారులు హాజరయ్యారు.
—————————–