రాహుల్‌గాంధీకి సవాలు విసిరిన బండి సంజయ్
* దమ్ముంటే ఓయూలో పర్యటించాలని సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ(BJP) పాలిస్తున్న రాష్ట్రాల్లో నిరుద్యోగం (Unemployment) విపరీతంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Congress leader Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీ (BJP MP), కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తుందని సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీయే అంటువ్యాధి లాంటిదని మండిపడ్డారు. మీ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంది కదా… ఉస్మానియా యూనివర్శిటీ (Osmania University) లో తిరిగే దమ్ముందా?’’ అంటూ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కి సవాలు విసిరారు. ఓయూకి వెళ్లి నిరుద్యోగులను కలిసి వాళ్ల సమస్యలపై మాట్లాడగలరా అని ప్రశ్నించారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలోని మల్లికా కన్వెన్షన్ (Mallika Convention) లో జరిగిన బీజేపీ (BJP) రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం (State wide meeting) లో బండి సంజయ్ (Bandi Sanjay) పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాలను గుర్తించి బీజేపీకి 8 ఎంపీ సీట్లు అందించారని తెలిపారు.
————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
