Minister Konda Surekha Gold Rakhi to CM Revanth Reddy
అకేరు న్యూస్ హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. సీఎంకు ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీని కట్టారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టినట్లు ఆమె తెలిపారు.
సీఎం కోసం ప్రత్యేకంగా బంగారు రాఖీని తయారు చేయించి తీసుకొచ్చినట్లు కొండా సురేఖ వెల్లడించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మనవడికి, అల్లుడికి కూడా రాఖీలు కట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి పండగ వాతావరణంలో కొంతసేపు గడిపారు.
ఇటీవల రాజకీయంగా చోటుచేసుకున్న పరిణామాలపై ప్రశ్నలు ఎదురైనా.. రాఖీ పండగ సందర్భంగా తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఇది పండగ వాతావరణం.. ఈ రోజు ఎలాంటి కామెంట్స్ చేయను అంటూ రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.
ప్రతి ఏడాది రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోందని మంత్రి తెలిపారు.
ఈసారి ప్రత్యేకంగా బంగారు రాఖీ కట్టడం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
