Anganwadi Rotten Eggs Hyderabad
* చిన్నారులు, గర్భిణీల ఆరోగ్యంతో చెలగాటం!
అకేరు న్యూస్ హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలకు అందించే పౌష్టికాహారంపై నిర్లక్ష్యం బయటపడింది. పెద్దఅంబర్పేట్లోని ఓ అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిపోయిన కోడిగుడ్లు ప్రత్యక్షమయ్యాయి. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన గుడ్లు నాణ్యత లేకుండా కుళ్లిపోయి కనిపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారులు, గర్భిణీలు తినే ఆహార పదార్థాలను ముందుగా పరిశీలించకుండా ఎలా పంపిణీ చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కుళ్లిన గుడ్లు తినిపిస్తే చిన్నారులు, గర్భిణీల ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సిన అధికారులు.. సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యతను ఎందుకు పరిశీలించడం లేదని నిలదీస్తున్నారు.
కుళ్లిన గుడ్లు ఎలా వచ్చాయి? వాటిని ఎవరు తనిఖీ చేశారు? బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
