* నిన్న రాత్రి అత్యంత ఘనంగా వివాహ వేడుక
ఆకేరు న్యూస్ డెస్క్ : పారిశ్రామిక దిగ్గజం, అపరకుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (Reliance Chairman Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ (Viren Merchant) కుమార్తె రాధిక మర్చంట్ (Radhika Merchant) వివాహవేడుక (Wedding Ceremony) శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా జరిగింది. ముంబై (Mumbai) లోని జియో వరల్డ్ సెంటర్ (Jio World Center) లో జరిగిన ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలించారు. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు సందడి చేశారు. పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ అగ్రతారాగణం, అంతర్జాతీయ వ్యాపార, క్రీడా కళా రంగాల ప్రముఖులు విచ్చేశారు.
బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ (Former British Prime Minister Tony Blair) వీరి వివాహానికి హాజరయ్యారు. బీహార్ మాజీ సీఎం లాలూ కుటుంబ సభ్యులతో ముంబై వచ్చారు. ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ (Prime Minister Modi) ఇవాళ ముంబైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ముఖ్యమైన ప్రాజెక్టుల భూమిపూజను ప్రారంభించి, నిర్వహించనున్నారు.అనంత్ అంబానీ (Anant Ambani), రాధికా అంబానీ (Radhika Ambani) ల రిసెప్షన్‌కు కూడా ప్రధాని మోదీ హాజరవుతారని తెలుస్తోంది. పీఎంవో తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో, అనంత్-రాధిక వివాహ రిసెప్షన్‌కు ప్రధాని మోదీ హాజరవుతారని సమాచారం.
———————–