Telangana rain Alert
* ఉరుములు, మెరుపులతో వర్షాల హెచ్చరిక
అకేరు న్యూస్,హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం మరోసారి మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీనమైన నిర్మాణాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో ఇటీవల వర్షాల పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా వాతావరణ హెచ్చరికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
