Tirumala Devotees Rush
* తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు
* నిన్న ఒక్కరోజే 77,042 మంది సందర్శన
ఆకేరు న్యూస్, తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి దర్శనానికి గంటల గంటల నిరీక్షణ తప్పడం లేదు. తిరుమలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 8 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమలలో అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 77,042 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అలాగే 36,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.5 కోట్లుగా నమోదైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

