Mulugu Landmine Blast
* పశువుల కాపరి మృతి
* ఆదివాసుల్లో భయం..భయం
ఆకేరు,న్యూస్ ములుగు : వెంకటాపురం మండలం కర్రెగుట్ట అడవుల్లో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడు ప్రమాదంలో నూగూరు గ్రామానికి చెందిన మడకం నాగేశ్వరరావు అనే పశువుల కాపరి మృతి చెందారు. బందువుల కథనం ప్రకారం, నాగేశ్వరరావు తన ఆవులను మేపే నిమిత్తం బుధవారం సాయంత్రం కర్రెగుట్ట అడవుల్లోకి వెళ్లగా అక్కడ అమర్చిన ల్యాండ్‌మైన్ అకస్మాత్తుగా పేలింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే అడవిలోకి వెళ్లి, మృతదేహాన్ని కాలినడకన నూగూరు గ్రామానికి తరలించారు.
ఈ ఘటనతో కర్రెగుట్ట( Karregutta ) పరిసర ప్రాంతాల గిరిజన గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అడవుల్లో ఇప్పటికీ ఇంకా మందుపాతరలు (Landmines) ఏమైనా మిగిలి ఉన్నాయనే భయంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటన సమాచారం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు కర్రెగుట్ట ప్రాంతంలో అప్రమత్తమయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
