* పోస్టుల పెంపు, డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగుల డిమాండ్
* ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేస్తున్న పోలీసులు
* బీఆర్కే భవన్ సైతం ముట్టడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెగా డీఎస్సీ (Mega DSC) నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చేపట్టిన తెలంగాణ సచివాలయ ముట్టడి ఉద్రిక్తతంగా మారింది. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాళేశ్వరం కమిషన్ సభ్యులు బీఆర్ కే భవన్లో ఉన్నారన్న విషయం తెలియడంతో నిరుద్యోగులు అక్కడ కూడా ఆందోళన చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలిరానున్న నేపథ్యంలో సచివాలయం వద్ద భారీగా పోలీసులును మోహరించారు. బాహుబలి బారికేడ్లు, ఇనుపకంచెలు, వాటర్ క్యాన్లను ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రం నలుమూలల నుంచి సచివాలయ ముట్టడికి తరలివస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థి, యువజన నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. పలువురిని గృహనిర్బంధంలో ఉంచారు. తార్నాకలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలుని (Tunga Balu) తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు.
———————————————-