డ్రగ్స్ కేసులో రకుల్‌ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ అరెస్ట్.
* రాజేంద్రనగర్ పోలీసుల అదుపులో అమన్‌ప్రీత్ సింగ్
* సైబరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
* రూ.2కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్..
* మరో నలుగురు నైజీరియన్ల అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసులు, నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ పోలీసుల సంయుక్త దాడిలో భారీగా డ్రగ్స్ (Drugs) లభ్యమయ్యాయి. టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ (Amanpreet Singh) ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సేవిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెగ్గా పట్టుకున్నారు. అతడితో పాటు మరో నలుగురు నైజీరియన్లను కూడా అరెస్ట్ చేశారు. ఈకేసులో అమన్‌ప్రీత్ సింగ్ కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడి నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చి టాలీవుడ్ లోని పలువురికి అందిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోవా కేంద్రంగా ఈ డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ కూడా గతంలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
—————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
