తెలంగాణలోని ఐదు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటన
* భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపపథ్యంలో ఆ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఆవర్తనం పశ్చిమబెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని పేర్కొన్నది. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొన్నది.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
