CM Revanth Reddy Kodangal Visit
* అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
* అధికారుల విస్తృత ఏర్పాట్లు
ఆకేరు న్యూస్, వికారాబాద్ జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్‌లో పర్యటించనున్నారు. టీచర్స్ డే సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. కొడంగల్ జూనియర్ కళాశాల గ్రౌండ్లో ఉదయం 10 గంటల నుంచి 11 వరకు జరిగే ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి హాజరై ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రావడంతో కొడంగల్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. సీఎం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించడంతో పాటు, బాలికల ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను కూడా ప్రారంభించనున్నారు. తన నియోజకవర్గమైన కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విద్యకు ప్రాధాన్యం.. వైద్య రంగానికి కొత్త ఊపు.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన కొనసాగనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
