Kerala Road Accident 8 Students
* కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం
* మృతుల స్వస్థలం తమిళనాడు
ఆకేరు న్యూస్, కేరళ : కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులను తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నించారు. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి 8 మంది విద్యార్థులు మృతి చెందడంతో తమిళనాడు, కేరళలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
