KCR Assembly Attendance
* అసెంబ్లీకి రావాలా? వద్దా? మీరే చెప్పండి
అకేరు న్యూస్, ఎర్రవల్లి : బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అలాంటి వారితో చర్చించేందుకు తాను అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
“నేను అసెంబ్లీకి రావాలా..? వద్దా..? మీరే చెప్పండి” అంటూ పార్టీ నేతలనే కేసీఆర్ ప్రశ్నించారు. తన చావును కోరుతూ పదేపదే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. తనను అసెంబ్లీకి రావాలని ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కేసీఆర్.. “ఇది థర్డ్‌క్లాస్ పాలన.. తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్ కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులను పరిశీలిద్దామని పిలుపునిచ్చారు.
కేసీఆర్ తాజా వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అసెంబ్లీకి ఆయన హాజరు అంశం హాట్‌టాపిక్‌గా మారింది. గతంలోనూ కాళేశ్వరం, సాగునీటి అంశాలపై కేసీఆర్ అసెంబ్లీకి రావాలని అధికార కాంగ్రెస్ డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
