Katapur ZPHS Alumni Reunion
ఆకేరు న్యూస్,ములుగు: మండలంలోని కాటా పూర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో1995 96 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక పాఠశాల ఇంచార్జీ ప్రధాన ఉపాధ్యాయులు సకృనాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్వ విద్యార్థులు తన అనుభవాలను, ఆనాటి గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయతతో మాట్లాడుకుంటూ తమ కుటుంబంలో మంచి చెడులను ఒకరికొకరు తెలుపుకొని ఆనందం తో తన్మయత్వం పొందారు. పూర్వ విద్యార్థులు ఒక కమిటీగా ఏర్పడి ముందు రోజుల్లో జరగబోయే ఎటువంటి కార్యక్రమానికైనా తమ వంతు సహకారాలు అందించాలని తీర్మానించారు .అనంతరం కమిటీ ఏర్పాటు చేసిన కమిటీలో గౌరవాధ్యక్షులుగా మంకిడి నరసింహ స్వామి, అధ్యక్షులుగా కందకట్ల సాంబయ్య, ట్రెజరీగా దిడ్డి మల్లయ్య, ఉపాధ్యక్షులుగా పర్వతాల కృష్ణ సాయి, కోశాధికారిగా గూడూరు రాజేంద్రప్రసాద్ ,మహిళా కార్యదర్శిగా కుసుమ రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా కూచన రాజు, పాటు కమిటీ సభ్యులుగా అమరావతి బుచ్చి రాములు, వెంకటేశ్వర్లు , ముకుందం ,రహిమాన్, కృష్ణ, రాంబాబు, ఆదినారాయణ, ఎందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దిడ్డి మోహన్ రావు, పూర్వ ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి ,శ్రీహరి ,ఎన్ ఆర్ ఐ పులి రమాదేవి ,పూర్వ విద్యార్థులు గీత, సునీత, అమరావతి, రాధిక, ఎండి రహిమాన్ ,వెంకటేశ్వర్లు, వేములేశ్వర్ ,నీలం బాబు, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
