BRS Leaders Protest at Assembly
* కేటీఆర్ కు చేయి, ముఖంపై గాయాలు
* ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అంటూ హరీశ్‌రావు ధ్వజం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని, ప్రజాస్వామ్యానికి అత్యంత చీకటి రోజని తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అగ్రనేతలు, మాజీ మంత్రులపై పోలీసులు అనుసరించిన వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ప్రతిపక్ష నేతలపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని రోడ్డుపై పబ్లిక్‌గా చీర లాగి తీవ్రంగా అవమానించారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికి దౌర్జన్యానికి దిగారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా పోలీసులు అత్యంత కఠినంగా ప్రవర్తించారని, ఆయన ముఖం, చేతిపై తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
* ఎమ్మెల్యేకు రక్తం కారేలా..
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కాలు మీద తొక్కితే చర్మం కమిలిపోయి రక్తం కారుతున్నటు వంటి పరిస్థితి ఉందన్నారు. అదే విధంగా డాక్టర్ సంజయ్ చేయికి గాయాలై రక్తం కారుతున్నటువంటి పరిస్థితి అన్నారు. శాసనసభ్యుల మీద అడ్డగోలుగా పోలీసులు అరాచక పర్వాన్ని నిర్వహించారని, రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అతిగా ప్రవర్తించారని ఆరోపించారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
* వెంటనే చర్యలు తీసుకోవాలి
మహిళా ప్రజాప్రతినిధుల పై అమానుషంగా ప్రవర్తించడం ఎప్పుడూ చూడలేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం పోలీసు బలగాలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఈ దౌర్జన్యకాండకు బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును ఎవరూ కాలరాయలేరని స్పష్టం చేశారు.
* అసెంబ్లీలో మ్యాచ్ ఫిక్సింగ్
ఇవాళ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మమ్మల్ని సభ బయట అడ్డుకొని, మీరు లోపల ఉన్నారని ప్రధాన ప్రతిపక్షం లేకుండా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ 22ఏపై ఎలా చర్చ జరుపుతున్నారని ప్రశ్నించారు. మా టీషర్ట్ లపై చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి రాతలూ లేవని స్పష్టం చేశారు. ఆనాడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రధాని మోడీ తీరుకు వ్యతిరేకంగా టీ షర్ట్ లు వేసుకొని, స్టిక్కర్లేసుకుని పార్లమెంటుకు పోలేదా అని ప్రశ్నించారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలన్నారని, 1000 రోజులైనా అమలు చేయడంలో వైఫల్యం చెందారని అన్నారు.
* ప్లాన్ ప్రకారమే..
ఇప్పటికే బీఆర్ఎస్ ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని, ప్రభుత్వ తప్పులను, వైఫల్యాలను, స్కామ్‌లను శాసనసభ వేదికగా ఎండగడతామనే భయంతోనే మా ప్రధాన నేతలను ప్లాన్ ప్రకారం అడ్డుకుంటున్నారని అన్నారు. తాము లేకుండానే సభలో ఏకపక్షంగా చర్చ జరిపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మీకు నిజాయితీ ఉంటే, మీరు తప్పులు చేయకపోతే… ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థుల భవిష్యత్తుపై సభలో ప్రత్యక్షంగా చర్చకు సిద్ధపడండి” అని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
* ఈ ప్రభుత్వానికి కనికరం లేదు..
గత మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మొన్న కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ సాధించి, ఉద్యోగ ఆఫర్ లెటర్లు చేతిలో ఉన్నప్పటికీ… ఫీజు బాకీల వల్ల కళాశాల యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని రోదిస్తున్న విద్యార్థులు రోజూ తమను కలుస్తున్నారన్నారు. చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాల్లో చేరలేక వందలాది మంది విద్యార్థులు తమ జీవితాలను కోల్పోతుంటే ఈ ప్రభుత్వానికి కనీసం కనికరం లేదని ధ్వజమెత్తారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
