Collector Chahat Bajpai
* హసన్పర్తి పీహెచ్సీలో ఇక 24 గంటల వైద్యం..
* అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
ఆకేరు న్యూస్, హనుమకొండ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల పాటు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందించాలని సూచించారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్పర్తిలోని ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి తనిఖీ చేశారు.
వ్యాక్సిన్ గది, ఆపరేషన్ థియేటర్, ఇన్పేషెంట్ గది, సిబ్బంది గది, నర్సుల గది, ఇంజక్షన్ రూమ్, ల్యాబొరేటరీ, ఫార్మసీ, టాయిలెట్లు తదితర విభాగాలను పరిశీలించిన కలెక్టర్.. ఆయా విభాగాల్లో అందుతున్న సేవలు, నిర్వహణ తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులను కలెక్టర్ నేరుగా కలిసి మాట్లాడారు. ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్ను కూడా కలెక్టర్ పరిశీలించారు.
* మౌలిక సదుపాయాలపై దృష్టి
ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలతో పాటు నిర్వహణ కూడా పటిష్టంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. రోగులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని, ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి గౌరవంగా, బాధ్యతాయుతంగా సేవలందించాలని వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ సూచించారు. తహసీల్దార్ కిరణ్ కుమార్తో పాటు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
