Kangana Ranaut Supports Trisha
* మహిళలను లక్ష్యంగా చేసుకోవడం పై ఫైర్
అకేరు న్యూస్,హైదరాబాద్: నటి త్రిషకు కంగనా మద్దతు గా నిలిచారు. విజయ్, నటి త్రిషకు సంబంధం ఉందంటూ పుకార్లు వెలువడుతున్నప్పటికీ.. ఇప్పటివరకు విజయ్ కానీ, త్రిష కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఈ అంశం తరచూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు వ్యాఖ్యలు దీనికి మరింత ప్రాధాన్యం తీసుకొస్తున్నాయి.
* ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది
ఎంపీ కంగనా రనౌత్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ వివాదంలో త్రిషకు మద్దతుగా ఆమె వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసినట్లు ప్రచారం జరుగుతున్న వ్యాఖ్యలపై స్పందించారు. ఒక మహిళ వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్‌ను లక్ష్యంగా చేసుకోవడం అనేది మహిళలను అప్రతిష్ఠపాలు చేయడానికి చాలాకాలంగా ఉపయోగిస్తున్న విధానమని కంగనా అన్నారు. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదని.. మహిళలపై దూషణలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే సందర్భాల్లో వారినే లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
* గౌరవం ఇస్తున్నామా?
ఇలాంటి దాడులు, ఆరోపణలు ఎప్పుడు ఆగుతాయని కంగనా ప్రశ్నించారు. సమాజం ముందుగా తనను తాను ప్రశ్నించుకోవాలని, మహిళలను ఎలా చూస్తున్నాం? వారికి నిజంగా గౌరవం ఇస్తున్నామా? అనే విషయాలను ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. విజయ్‌తో త్రిషకు సంబంధించిన ఈ వ్యవహారంలో అనవసరంగా త్రిషను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారనే అభిప్రాయాన్ని కంగనా తన వ్యాఖ్యల ద్వారా వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
