Dharavath Raju Best Teacher Award felicitation
* ఉత్తమ ఉపాధ్యాయుడు రాజుకి సన్మానం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ధరావత్ రాజు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి లకావత్ చిరంజీవి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు.
* ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమే కాదు..
ఈ సందర్భంగా లకావత్ చిరంజీవి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగం కాకుండా బాధ్యతతో, సేవగా భావిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం అంకితభావంతో హిందీ ఉపాధ్యాయుడు ధరావత్ రాజు పని చేస్తున్నారని అన్నారు. ఆయనకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కడం స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతానికే గర్వకారణమని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
* బోధన తరగతి గదికే పరిమితం కాకుండా..
ఒక మంచి ఉపాధ్యాయుడి బోధన తరగతి గదికే పరిమితం కాకుండా అది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడానికి చేస్తున్న కృషి మరువలేనిది అని అన్నారు. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుడిగా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆయనకు లభించిన రాష్ట్రస్థాయి పురస్కారం భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో సేవలందించేందుకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. వారు ఉన్నత అవార్డులు అందుకుని విద్యారంగానికి మరింత సేవ చేయాలని ఆయన సేవలు మరెందరో ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకమని లకావత్ చిరంజీవి అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ బైరీ సురేందర్ రెడ్డి, ఉపాధ్యాయుడు బి.వాసు, ముదిరాజ్ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంటాల యాదగిరి, విద్యార్థి నాయకులు గుండె రంజిత్, బానోత్ తిరుపతి, రమేష్, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
