Manda krishna Madiga, SC Categorisation Demand
* ఎమ్మార్పీఎస్-ఎంఎస్పీ జాతీయ సదస్సు
* పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నం – మందకృష్ణ
అకేరు న్యూస్, వరంగల్ : ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్-ఎంఎస్పీ జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఎమ్మార్పీఎస్-ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ కమిటీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
* ఎస్సీ వర్గీకరణే ప్రధాన లక్ష్యం..
ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఉద్యమం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొందని సదస్సులో నాయకులు పేర్కొన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థాగతంగా మరింత విస్తరించేందుకు జాతీయ సదస్సును నిర్వహించినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 జిల్లాల అధ్యక్షులు వేదికపైకి రావాలని, అలాగే దాదాపు 1,100 మండలాల్లో కమిటీలను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నుంచి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నలుగురు నాయకులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
* క్రిస్టియన్ రిజర్వేషన్లపై ఫోకస్..
సదస్సులో మందకృష్ణ మాదిగ చేసిన డిమాండ్ ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. క్రిస్టియన్‌గా మతం మారిన దళితులకు రిజర్వేషన్లు మార్చడాన్ని ఎమ్మార్పీఎస్ వ్యతిరేకిస్తుందని, అదే సమయంలో క్రిస్టియన్ మతంలోకి మారిన రెడ్డి, వెలమ తదితర అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు మార్చాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. అర్హత, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లపై స్పష్టమైన విధానం ఉండాలని ఆయన కోరినట్లు ఎమ్మార్పీఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాన్ని ఉద్యమంలో ప్రధాన డిమాండ్‌గా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.
* డ్రెస్ కోడ్.. టైమ్‌పై కఠిన నిబంధనలు..
జాతీయ సదస్సులో డ్రెస్ కోడ్, సమయపాలనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. డ్రెస్ కోడ్ లేకుండా వచ్చిన ప్రతినిధులు సభ నుంచి బయటకు వెళ్లి నిర్దేశించిన దుస్తులు ధరించి తిరిగి రావాలని సూచించారు. సమావేశానికి ఆలస్యంగా రావడాన్ని కూడా అనుమతించకుండా క్రమశిక్షణ పాటించాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. సంస్థాగత క్రమశిక్షణే ఉద్యమ బలం అనే సందేశాన్ని ఈ సదస్సు ద్వారా నాయకత్వం ఇచ్చినట్లు తెలుస్తోంది.
* అన్ని వర్గాలకు అండగా ఎమ్మార్పీఎస్..
ఎమ్మార్పీఎస్ కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన సంస్థ కాదని, అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం అండగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో మాత్రం ఉద్యమం ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఎన్నో రాజకీయ, సామాజిక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసి కొత్త దశలోకి తీసుకెళ్లేందుకు ఈ జాతీయ సదస్సు వేదికగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
