Gutha Sukender Reddy
* పనులపై నిధుల ఆలస్య ప్రభావం
ఆకేర్ న్యూస్, హైదరాబాద్ : ఎమ్మెల్సీ నిధులపై గుత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని శాసనమండలి సభ్యులకు రావాల్సిన నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సిడిపి) సుదీర్ఘకాలంగా పెండింగ్లో పడిపోవడంపై గుత్తా సుఖేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
శాసనమండలి ప్రాంగణంలో జరిగిన పరిణామాల్లో భాగంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీరును ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి అత్యంత కీలకమైన ఈ నిధులను తక్షణమే విడుదల అయ్యేలా చూడాలని, అందుకోసం పాలనాపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
* ఇన్చార్జ్ మంత్రి సంతకమే ఆమోదానికి కీలకం
ఎమ్మెల్సీల నిధుల విడుదల అంశంపై సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇది మీ నేరుగా చూసే శాఖ కాకపోయినప్పటికీ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా మీ పాత్ర అత్యంత కీలకమైనదని గుర్తుచేశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మంజూరు చేయాలంటే, దానికి సంబంధించి ఇన్చార్జ్ మంత్రిగా మీరు సంతకం చేసి ఆమోదం తెలపడం తప్పనిసరని వివరించారు. ఇన్చార్జ్ మంత్రి సంతకం చేయకపోవడం వల్లే ఆర్థిక శాఖ వద్ద ఈ ఫైలు నిలిచిపోయిందని, ప్రజాప్రతినిధులు నిధుల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు.
పనులపై నిధుల ఆలస్య ప్రభావం
అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, అత్యవసర ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ నిధులు ఎంతగానో దోహదపడతాయని గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తుచేశారు. పరిపాలనాపరమైన చిక్కులు, సాంకేతిక ఆలస్యాల కారణంగా ఈ నిధులు నిలిచిపోవడం వల్ల నియోజకవర్గాల్లో పనులు మందగించడమే కాకుండా ప్రజలకు ప్రజాప్రతినిధులు జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సొంత ప్రభుత్వం లేదా మంత్రుల పనితీరుపై ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని చైర్మన్ నేరుగా స్పందించడం గమనార్హం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
